LIC: ఇండియాలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. LICలో కొన్ని రకాల పాలసీలు... భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. మీరు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రతినెలా పెన్షన్ పొందాలి అనుకుంటే... వెంటనే పొందవచ్చు. ఇలాంటి చాలా స్కీములు ఉన్నాయి. అలాంటి వాటిలో జీవన్ ఉమంగ్ పాలసీ (Jeevan Umang Policy). ఈ పాలసీలో మీరు ప్రతి నెలా చిన్న మొత్తం చెల్లిస్తూ ఉంటే... మీరు రూ.27 లక్షలు పొందగలరు. (ప్రతీకాత్మక చిత్రం)
Scheme details: ఈ పాలసీని 3 నెలల చిన్నారి మొదలు... 55 ఏళ్ల వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది మీకు 100 వచ్చే వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తుంది. ఈ పాలసీ కింద మీరు లోన్ కూడా పొందవచ్చు. ప్రీమియం చెల్లించే గడువు కాలం దీనికి 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు ఉంది. గడువు తర్వాత మీరు రూ.27.60 లక్షలు పొందగలరు. అలాగే... సర్వైవల్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రూ.27.60 ఎలా వస్తాయి: LIC జీవన్ ఉమంగ్ పాలసీలో మీరు రోజూ రూ.43 పోగేస్తూ... నెలవారీ రూ.1302 ప్రీమియం చెల్లిస్తూ ఉంటే... మీ సంవత్సర ప్రీమియం రూ.15,298 అవుతుంది. ఇలా 30 ఏళ్లపాటూ ఈ పాలసీని నడిపిస్తే... మొత్తం పెట్టుబడి రూ.4.58 లక్షలు అవుతుంది. కొత్త రూల్స్ ప్రకారం మీరు ప్రతి సంవత్సరం రిటర్న్స్ పొందగలరు. సంవత్సర రిటర్న్స్ రూ.40,000 అవుతాయి. మీరు ఏటా ఇలా రిటర్న్స్ తీసుకుంటూ ఉంటే... 100 ఏళ్లు వచ్చేవరకు మీకు మొత్తం అన్నీ కలిపి రూ.27.60 లక్షలు వెనక్కి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)