ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు విషయానికి వస్తే.. రూ.100 ఖర్చుపై 2 రివార్డు పాయింట్లు వస్తాయి. కాంప్లిమెంటరీ లాస్ట్ క్రెడిట్ కార్డు లయబిలిటీ ఇన్సూరెన్స్ లభిస్తుంది. రూ. 3 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, రూ. కోటి వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్, ఫ్యూయెల్ సర్ చార్జ్ మాఫీ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
అలాగే ఈ కార్డుపై క్యాష్ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు వంటివి అవసరం అవుతాయి. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ లేదంటే ఎల్ఐసీ కార్డ్స్ వెబ్సైట్ ద్వారా ఈ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు.