LIC Policy: రోజుకు రూ.28 పొదుపుతో రూ.3.97 లక్షలు రిటర్న్స్
LIC Policy: రోజుకు రూ.28 పొదుపుతో రూ.3.97 లక్షలు రిటర్న్స్
LIC Aadhaar Stambh Policy | ఆధార్ కార్డు ఉన్న పురుషుల కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ప్రత్యేకంగా ఓ పాలసీని రూపొందించింది. బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.
1. మీరు ఏదైనా పొదుపు పథకం కోసం సెర్చ్ చేస్తున్నారా? మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఆధార్ స్తంభ్ పేరుతో ఓ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ కేవలం ఆధార్ కార్డ్ ఉన్న పురుషులకు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. ఈ పాలసీలో రోజూ రూ.28 లెక్కన పొదుపు చేస్తే పాలసీ మెచ్యూర్ అయ్యాక సుమారు రూ.3.97 లక్షలు చేతికి వస్తాయని అంచనా. మరి ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలేంటీ? ఎంత లాభం ఉంటుంది? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఎల్ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీలో చేరడానికి కనీస వయస్సు 8 ఏళ్లు. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.75,000. గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.3,00,000. పాలసీ గడువు 10 నుంచి 20 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, డైలీ పద్ధతిలో ప్రీమియం చెల్లించొచ్చు. మొదటి ఐదేళ్లలో చనిపోతే 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత చనిపోతే 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్'+లాయల్టీ అడిషన్ చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఉదాహరణకు 28 ఏళ్ల వయస్సు గల వ్యక్తి రూ.3,00,000 సమ్ అష్యూర్డ్కు పాలసీ తీసుకున్నాడనుకుందాం. పాలసీ గడువు 20 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.10,314. అంటే రోజుకు రూ.28 చెల్లించాలి. 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,06,280. మెచ్యూరిటీ తర్వాత రూ.3,00,000 వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. దీంతో పాటు మీ ఇన్వెస్ట్మెంట్పై ఏటా 4.5 శాతం చొప్పున లాయల్టీ అడిషన్ రూ.97,500 వస్తుంది. అంటే మొత్తం రూ.3,97,500 రిటర్న్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)