మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులే ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. వాటిలో యాక్సిస్ బ్యాంక్ ముందుంటుంది. ఈ తాజాగా డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించింది. దేశీయ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది.
3 నెలల నుంచి ఆరు నెలల వరకు 3.50 శాతం, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.40 శాతం, ఏడాది నుంచి ఏడాది 5 రోజుల వరకు 5.10 శాతం, ఏడాది 5 రోజుల నుంచి ఏడాది 11 రోజుల వరకు 5.15 శాతం, ఏడాది 11 రోజుల నుంచి ఏడాదిన్నర వరకు 5.10 శాతం, 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 5.25 శాతం, రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.40 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.75 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తోంది.