పెట్టుబడులు పెట్టండి, ముఖ్యమైన ఖర్చులు చేయండి (సెక్షన్ 80C)
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), జీవిత బీమా ప్రీమియం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) ట్యూషన్ ఫీజు, సుకన్య సమృద్ధి యోజన (బాలికల కోసం పొదుపు పథకం), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌కు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల లోపు చేసిన పెట్టుబడులు వ్యక్తి ఆదాయం నుంచి మినహాయిస్తారు. చాలా ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నా ఇలాంటి వాటి ద్వారా పన్నులను సక్రమంగా ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
హోమ్ లోన్ ఉన్నట్లయితే, మీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి సంవత్సరానికి లోన్ రీపేమెంట్ తాత్కాలిక స్టేట్మెంట్ తీసుకోండి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద అనుమతించిన మార్గాలలో ఇప్పటికే ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారనే అంశంపై స్పష్టత వస్తుంది. లోటు ఉంటే.. తదనుగుణంగా పెట్టుబడులు చేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సెక్షన్ 80C అయిపోయినట్లయితే, NPSలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే అదనంగా రూ.50,000 పన్ను మినహాయింపును అందించే సెక్షన్ 80CCD1Bని పరిశీలించాలి. ఇది సెక్షన్ 80C కింద పొందే పన్ను మినహాయింపు కంటే ఎక్కువ. జీవిత బీమా కవర్ లేకపోతే, బీమా అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
బీమా చేసిన వ్యక్తులు సీనియర్ సిటిజన్ అయితే వ్యక్తిగతంగా రెట్టింపు మొత్తం రూ.50 వేలు, కుటుంబానికి, తల్లిదండ్రులకు (మొత్తం రూ.1 లక్ష) క్లెయిమ్ చేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రివెంటివ్ మెడికల్ చెకప్ చేయించుకున్నట్లయితే, సెక్షన్ 80డి కింద రూ.5,000 వరకు ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)