కోవిడ్ రాక ముందు చూస్తే.. స్థలం ధరలు చదరపు యార్డ్‌కు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉండేదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ (ల్యాండ్ సర్వీసెస్) మయాంక్ సక్సేనా తెలిపారు. అయితే ఇప్పుడు చదరపు యార్డ్ రేటు రూ. 1.25 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు.
హైదరాబాద్‌లో చూస్తే.. అపార్ట్మెంట్ల పరిమాణం కూడా పెరిగిందని తెలిపారు. లగ్జరీ రెసిడెన్షియల్ ట్రెండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. కోవిడ్ ముందు డబుల్ బెడ్ రూమ్స్ విత్ 1200 చదరపు అడుగులు, ట్రిపుల్ బెడ్ రూమ్స్ ఆఫ్ 1800 చదరపు అడుగులు ఉండేవని, కానీ ఇప్పుడు 7 వేల నుంచి 10 వేల చదుపు అడుగులతో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అంటే ఇలాంటి ఇళ్లకు డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా మరోవైపు దేశంలో ఇళ్ల అమ్మకాలు 9 ఏళ్ల గరిష్టానికి చేరాయని మరో నివేదిక పేర్కొంటోంది. 2022లో ఇళ్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదు అయ్యిందని తెలిపింది. నైట్ ఫ్రాంక్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో హౌసింగ్ సేల్స్ 34 శాతం మేర పెరిగాయని పేర్కొంది. అలాగే ఆఫీస్ లీజింగ్ కూడా 36 శాతం మేర పైకి కదిలిందని తెలిపింది.
ఇళ్ల అమ్మకాలు 2022లో 34 శాతం పెరుగుదలతో 3,12,666 యూనిట్లకు చేరాయని నివేదిక పేర్కొంటోంది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ కూడా 36 శాతం పెరుగుదలతో 51.6 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని తెలిపింది. ఇంటి ధరలు పెరిగినా, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పైకి చేరినా కూడా ఇంటి అమ్మకాల్లో పెరుగుదల నమోదు అయ్యిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2023లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని అంచనా వేశారు.
వార్షిక ప్రాతిపదికన చూస్తే.. 2022లో ఢిల్లీ ఎన్సీఆర్లో ఇంటి అమ్మకాలు 67 శాతం పెరుగుదలతో 58,460 యూనిట్లకు చేరాయి. బెంగళూరులో అమ్మకాలు 40 శాతం పెరిగాయి. 53,363 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ముంబైలో అమ్మకాలు 35 శాతం పెరుగుదలతో 85,169 యూనిట్లకు ఎగశాయి. పుణేలో అమ్మకాలు 17 శాతం పెరిగాయి. 43,410 యూనిట్లుగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో చూస్తే.. అమ్మకాలు 28 శాతం పెరిగాయి. 31,046 యూనిట్లుకు చేరాయి. చెన్నైలో అమ్మకాలు 19 శాతం పరిగాయి. 14,248 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో కూడా అమ్మకాలు 58 శాతం పెరుగుదలతో 14,062 యూనిట్లకు చేరాయి. అయితే కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు తగ్గాయి. 10 శాతం క్షీణించాయి. 12,909 యూనిట్లుగా ఉన్నాయి.