1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంది. వడ్డీ ఎప్పట్లోగా జమ అవుతుందో స్పష్టత లేదు. దీపావళి తర్వాత ఈపీఎఫ్ వడ్డీ జమ అవుతుందన్న వార్తలొచ్చాయి. అంటే ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ వడ్డీ అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రెండేళ్ల క్రితం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎక్కువగా ఉండేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.5 శాతం వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ మాత్రమే ప్రకటించింది ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ ఖాతాదారులు తాము జమ చేసిన మొత్తంపై ప్రతీ ఏటా లభించే వడ్డీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈపీఎఫ్ వడ్డీని నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తుంది. 2021-22 వడ్డీ జమ కావాల్సి ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వడ్డీ ఇంకా ఎందుకు జమ కాలేదని ఈపీఎఫ్ ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అవుతోందని, ఒకవేళ వడ్డీ ఖాతాదారుల స్టేట్మెంట్లో కనిపించకపోతే అందుకు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ కారణమని క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నందున ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ కనిపించట్లేదని తెలిపింది. సెటిల్మెంట్ కోరుకునే అవుట్గోయింగ్ సబ్స్క్రైబర్లందరికీ, విత్‌డ్రాయల్ చేస్తున్నవారికి వడ్డీతో సహా చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ప్రకటిస్తుంది ఈపీఎఫ్ఓ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటును ప్రతిపాదిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ వడ్డీని ఆమోదిస్తుంది. ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి వడ్డీ జమ కావడంలో జాప్యానికి కారణమేంటో తెలియట్లేదు. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ కారణమని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినా, ఇప్పటికీ వడ్డీ జమ కాకపోవడంతో ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)