అయితే గతేడాది కేంద్రం విధించిన లాక్డౌన్, ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీంతో చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు సైతం సక్రమంగా చెల్లించలేకపోయాయి. ఫలితంగా చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. దీంతో గోల్డ్ లోన్ల వాటా భారీగా పెరిగింది.(ఫ్రతీకాత్మక చిత్రం)