3. కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ అనేది.. ఇల్లు, దానిలోని వస్తువులు, దాని నిర్మాణం, ఆవరణలో నివసించే వ్యక్తుల భద్రతకు కవరేజీ అందిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఆస్తి, ఇన్సూరెన్స్ చేసిన వస్తువుల విలువ, ప్రాంగణ నిర్మాణం, లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అగ్ని ప్రమాదం, దొంగతనం, ఇతర ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు కూడా కవరేజీ పొందాలంటే అదనపు ప్రీమియం చెల్లించవచ్చు. ఇలా విలువైన ఆస్తులు, వ్యక్తిగత వస్తువులు, తరలింపు అవసరమైతే పొందే తాత్కాలిక ఆశ్రయం కోసం ఖర్చులను కూడా పొందే అవకాశం ఉంది. హోమ్ ఇన్సూరెన్స్‌తో ఇంటికి మాత్రమే పరిమితం కాదు, నివాసితుల వస్తువులకు కూడా భద్రత కల్పిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కంటెంట్ ఓన్లీ పాలసీ సెలక్ట్ చేసుకుంటే అద్దె వసతి గృహంలో నివసిస్తున్న వారికి, హౌసింగ్ సొసైటీ నుంచి బేసిక్ ఇన్సూరెన్స్ పొందుతున్న వారికీ ఉపయోగపడుతుంది. ఇది నగలు, ఇతర విలువైన వస్తువుల నష్టాన్ని కవర్ చేస్తుంది. ప్రీమియం కవరేజీలో ఉన్న వస్తువుల మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. నష్టం జరిగినప్పుడు రీయంబర్స్మెంట్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సొసైటీలు సాధారణంగా స్ట్రక్చరల్ డ్యామేజ్ కవరేజీని ఎంచుకుంటాయి. బ్రేక్-ఇన్లు, సొసైటీ ఆస్తి దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఏదైనా ఇతర ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టం జరిగినప్పుడు ఇది రీయంబర్స్మెంట్ను కవర్ చేస్తుంది. సొసైటీ అటువంటి పాలసీని తీసుకుంటే.. వ్యక్తిగత వస్తువులను రక్షించడానికి కంటెంట్ ఓన్లీ కవరేజీ అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
7. హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేయని ప్రమాదాలు కొన్ని ఉంటాయి. వీటిలో ప్రకృతి వైపరీత్యాలు. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోని నిర్లక్ష్యం కారణంగా కలిగే నష్టాలు ఉన్నాయి. చెదపురుగులు, ఇతర తెగుళ్ల వల్ల నష్టం కలిగినా పరిహారం లభించదు. సభ్యుల దుర్మార్గపు చర్యలు, యుద్ధం లేదా తీవ్రవాద కార్యకలాపాలతో జరిగిన నష్టాలకు కవరేజీ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
9. హోమ్ ఇన్సూరెన్స్ ప్రమాదాలు, నష్టాలు, దొంగతనాలను కవర్ చేస్తుంది. దీన్ని ప్రీ డిఫైన్డ్ టెన్యూర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఒక ఏడాది లేదా చాలా సంవత్సరాలకు కవరేజీ పొందవచ్చు. ఎక్కువ సంవత్సరాలు కవరేజీ అందించేవి ఖర్చుతో కూడుకున్నవి. అధిక ప్రీమియం చెల్లించడం ద్వారా అదనపు కవరేజీని పొందవచ్చు. రీయింబర్స్ చేసిన మొత్తాన్ని మరమ్మత్తులు, కోల్పోయిన వస్తువులను తిరిగి పొందడం కోసం ఉపయోగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)