కారు కొనుక్కోవడం చాలామంది డ్రీమ్. అయితే తమ బడ్జెట్‌కు కొత్త కారు కొనుక్కోవడం కరెక్ట్ కాదని కొందరు తన నిర్ణయాన్ని మార్చుకుంటారు. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలని అనుకున్నా.. అందుకు బ్యాంకులు లోన్ ఇవ్వబోవని అనుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 6
అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయడానికి కూడా అనేక బ్యాంకులు లోన్ ఇస్తుంటాయి. వీటి వడ్డీరేట్లు కూడా అందుబాటులోనే ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 6
కారు ధరలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 శాతం వరకు లోన్ ఇస్తుంది. వడ్డీ రేటు 7.25 శాతం. ఇక కారు ధరలో 60 శాతం వరకు కెనరా బ్యాంక్ రుణంగా ఇస్తుంది. ఈ బ్యాంక్ 7.35 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 6
ఇక కారు ధరలో 60 శాతం వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణంగా ఇస్తుంది. ఈ బ్యాంక్ 7.35 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇక కారు ధరలో 80 శాతం వరకు లోన్‌గా ఇవ్వనున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్.. 8.30 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 6
కారు ధరలో 75 శాతం వరకు రుణం ఇవ్వనున్న ఎస్బీఐ.. 9.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కారు ధరతో సమానంగా లోన్ ఇచ్చే HDFC బ్యాంక్.. 11 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 6
ఇక కారు ధరలో 60 శాతం వరకు లోన్‌గా ఇవ్వనున్న ఐసీఐసీఐ బ్యాంక్.. 12 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. బ్యాంక్‌లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని మీ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు కోసం లోన్ తీసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం )