1. వాహనం కొంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ దాదాపు అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఆర్టీఓ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) లభిస్తుంది. ఏ వాహనానికైనా ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. (ప్రతీకాత్మక చిత్రం)
2. వాహనం అమ్మినప్పుడు ఆర్సీ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్లో వెహికిల్ ఆర్సీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? (How to Transfer your Vehicle RC Online) అన్న సందేహాలు వాహనదారుల్లో ఉన్నాయి. వాహనం అమ్మినప్పుడు మాత్రమే కాదు ఇతర సందర్భాల్లో కూడా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు పైకి వాహనాన్ని మార్చాలనుకున్నప్పుడు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి పేరు మీద ఉన్న వాహనాన్ని అదే కుటుంబంలో మరో వ్యక్తి పేరు మీదకు మార్చాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆన్లైన్లో ఈజీ స్టెప్స్‌తో ఆర్సీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆన్లైన్లో ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. వాహనాలను అమ్మితే ఫామ్ 29, ఫామ్ 30, ఫామ్ I, ఫామ్ II, ఒకవేళ వాహన యజమాని మరణిస్తే ఫామ్ 31, వేలం పాటలో వాహనాన్ని అమ్మితే ఫామ్ 32, ఒరిజినల్ ఆర్సీ, ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, ఇంజిన్, చాసిస్ నెంబర్ ప్రింట్ కాపీ, వాహనం కొనుగోలుదారుల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, కొనుగోలుదారుల అండర్‌టేకింగ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆన్లైన్లో ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుగా వాహన్ పరివాహన్ పోర్టల్ https://vahan.parivahan.gov.in/ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Vehicle Related Services ఓపెన్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం పేరు ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. మీ వెహికిల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రాష్ట్రానికి చెందిన ఆర్టీఓ సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ పైన క్లిక్ చేయాలి. మీ వాహనం నెంబర్, చాసిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాహనానికి సంబంధించిన సమాచారం వస్తుంది. ట్రాన్స్ఫర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కావాల్సిన సమాచారం ఎంటర్ చేసి ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి. అమ్మినవారు, కొన్నవారు అన్ని డాక్యుమెంట్స్ పైన సంతకం చేసి ఆర్టీఓకు సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)