3. సెక్షన్ 80(సీ), (సీసీడీ), (టీటీఏ) ద్వారా మినహాయింపులు పొందొచ్చు. 80(సీ)లో పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడులు పెట్టి రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు పొందొచ్చు. రూ.1.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే 80(సీసీడీ) కింద నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టొచ్చు. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,000 వరకు 80(టీటీఏ) కింద మినహాయింపులు ఉంటాయి.