ఖర్చులు తగ్గించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, పెరుగున్న వైద్య ఖర్చుల కారణంగా డబ్బు ఆదా చేసుకోవడం చాలా కీలకమని గుర్తుచేస్తున్నారు. ఇలా ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ కింది అంశాలను పాటించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కారణంగా వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఖర్చులను తగ్గించుకునేందుకు ఆరోగ్య బీమా చాలా అవసరం. తగినంత ఆరోగ్య బీమా మీ వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. ఆరోగ్య సంబంధిత ఖర్చుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ మీ కంపెనీ ఇచ్చిన ఆరోగ్య బీమా పరిధిలోకి రాకపోతే, కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)