భారతదేశంలో ఫేక్ కరెన్సీ ఓ పెద్ద సమస్యగా మారింది. నకిలీ కరెన్సీ నోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI లెక్కల ప్రకారం గతంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో నకిలీ 500 నోట్ల సంఖ్య 31.3 శాతం పెరిగింది. అంటే మార్కెట్లో నకిలీ రూ.500 నోట్ల చలామణి జోరుగా జరుగుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,453 నకిలీ రూ.500 నోట్లు, 1.11 లక్షల నకిలీ రూ.100 నోట్లు బయటపడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మొత్తంగా 2.09 లక్షల నకిలీ నోట్లు దొరికాయి. 2019-20 తో పోలిస్తే ఇది తక్కువే. ఆ సంవత్సరంలో 2.97 నకిలీ నోట్లు బయటపడ్డాయి. అయితే రూ.500 నోట్లు ఎక్కువగా బయటపడ్డట్టు తేలింది. 2016 నవంబర్లో కొత్త రూ.500, రూ.2000 నోట్లను ఆర్బీఐ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాత రూ.500, రూ.1,000 నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్లు వచ్చిన మొదట్లో నకిలీ నోట్లు పెద్దగా కనిపించలేదు. కానీ ఆ తర్వాత నకిలీ నోట్ల ముఠాలు చెలరేగిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. దీంతో చేతికి వచ్చే రూ.500 నోటు ఒరిజినలా, కాదా అని తేల్చుకోవడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే ఒరిజినల్ రూ.500 నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని గుర్తులను సూచించింది. ఒరిజినల్ రూ.500 నోటును గుర్తించేందుకు 17 గుర్తులు ఉంటాయి. వాటిని గమనిస్తే ఒరిజినల్ నోటును గుర్తించొచ్చు. వీటిలో ఏ గుర్తులు లేకపోయినా అది నకిలీ నోటే. మరి ఆ గుర్తులు ఏవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. కానీ రూ.2, రూ.5 నోట్లు ఎక్కడా కనిపించట్లేదు. ఇక నాణేల విషయానికి వస్తే 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు చలామణిలో ఉన్నాయి. వీటిలో 50 పైసల నాణేలు పెద్దగా కనిపించట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)