1. మార్చి వచ్చిందంటే పన్ను చెల్లింపుదారుల్లో టెన్షన్ మొదలవుతుంది. పన్ను ఆదా చేయడానికి ఉన్న మార్గాల కోసం వెతుకుతుంటారు. సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరుతుంటారు. ఇన్స్యూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా అనేక ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. అందులో ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్స్ (SBI Tax Saving Term Deposits) కూడా ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో ఏడాదికి రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. కనీసం 5 ఏళ్ల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 10 ఏళ్ల వరకు డిపాజిట్ కొనసాగించొచ్చు. ఈ స్కీమ్‌కు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు టర్మ్ డిపాజిట్లకు ప్రస్తుతం 5.5 శాతం వడ్డీ ఇస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇదే వడ్డీ ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ హోల్డర్లకు కూడా లభిస్తుంది. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాతే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. ఒకవేళ డిపాజిట్‌దారు మరణిస్తే నామినీ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌కు నామినేషన్ సదుపాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో లోన్ సదుపాయం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. టీడీఎస్ వర్తిస్తుంది. డిపాజిట్ హోల్డర్లు ఫామ్ 15G/15H సబ్మిట్ చేసి మినహాయింపు పొందొచ్చు. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ అకౌంట్ సింగిల్‌గా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ అకౌంట్‌ను మైనర్ పేరు మీద కూడా ఈ అకౌంట్ తెరవచ్చు. దేశంలోని అన్ని ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఈ అకౌంట్ తెరవొచ్చు. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ ఇతర ట్యాక్స్ సేవింగ్స్ పథకాలను కూడా అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి స్కీమ్స్ అందిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని వేర్వేరు సెక్షన్స్ కింద మినహాయింపులు పొందడానికి ఈ స్కీమ్‌లు ఉపయోగపడతాయి. ఈ పథకాలకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ బ్రాంచ్‌లో లేదా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)