1. డబ్బు పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటే మంచి పెట్టుబడి పథకం ఎంచుకోవడం అవసరం. దీర్ఘకాలం పాటు పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందడానికి సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఉపయోగపడుతుంది. ఈ స్ట్రాటజీతో ఎంత ఎక్కువకాలం డబ్బు పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. సిప్ ద్వారా మంచి రిటర్న్స్ సాధించాలంటే సరైన మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా కొంత చొప్పున ఎక్కువకాలం పొదుపు చేసి ఊహించని రిటర్న్స్ పొందొచ్చు. ఉదాహరణకు నెలకు రూ.300 చొప్పున మ్యూచువల్ ఫండ్‌లో పొదుపు చేసి కోటి రూపాయల రిటర్న్స్ పొందొచ్చంటే నమ్ముతారా? ఇది సాధ్యమే. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉదాహరణకు 18 శాతం రిటర్న్స్ ఇచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఎంచుకొని పొదుపు ప్రారంభించారనుకుందాం. నెలకు రూ.300 చొప్పున 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్స్ ఎంతో తెలుసా? కోటి రూపాయల పైనే. అవును. 35 ఏళ్లల్లో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం కేవలం రూ.1,26,000 కాగా మీకు రూ.1,04,00,000 లాభాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మ్యూచువల్ ఫండ్‌లో యావరేజ్‌గా 15 శాతం రిటర్న్స్ వస్తాయని చెబుతారు. ఈ లెక్కన మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే నెలకు రూ.700 చొప్పున 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. 15 శాతం రిటర్న్స్ ప్రకారం లెక్కిస్తే మీరు పెట్టుబడి పెట్టిన రూ.2,94,000 మొత్తానికి రూ.1,04,00,000 రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)