1. గత నెలలో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన తర్వాత పన్ను చెల్లింపుదారుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. కొత్త పన్ను విధానంలో (New Tax Regime) పలు మార్పులు చేయడంతో ట్యాక్స్ పేయర్స్‌లో అనేక డౌట్స్ వస్తున్నాయి. వీటిలో ప్రధానమైన డౌట్ ఆదాయపు పన్ను రిబేట్ లిమిట్ గురించి. కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ లభిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ రిబేట్‌తో కలిపి రూ.7 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ లిమిట్ రూ.5 లక్షలు మాత్రమే. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ.5 లక్షల వరకు వార్షికాదాయానికి రిబేట్‌తో లెక్కేస్తే ఎలాంటి ట్యాక్స్ పడదు. బడ్జెట్లో ప్రకటించినదాని ప్రకారం కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి రిబేట్‌తో కలిపి రూ.7 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ పాత పన్ను విధానంలో కొనసాగితే అప్పుడు రిబేట్‌తో లిమిట్ రూ.5 లక్షలు మాత్రమే. కొత్త పన్ను విధానంలో ఉన్న శ్లాబ్స్‌ని 6 నుంచి 5 కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్నులు ఉండవు. గతంలో ఇది రూ.2.5 లక్షలుగా ఉండేది. రూ.50,000 మినహాయింపు పరిమితిని పెంచింది ఆర్థిక శాఖ. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు వార్షికాదాయం ఉన్నవారికి 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 30 శాతం పన్నులు వర్తిస్తాయి. పాత పన్ను విధానంలో ఉన్నవారికి ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుందని, పాత పన్ను విధానం కావాలనుకుంటే ఎంచుకోవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సెక్షన్ 87ఏ విషయానికి వస్తే పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.12,500 వరకు ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. అన్ని మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కానీ కొత్త పన్ను విధానం ఎంచుకునేవారికి రిబేట్ ఎక్కువగా లభిస్తుంది. వారికి రూ.7 లక్షల వరకు వార్షికాదాయం ఉంటే రూ.25,000 రిబేట్ లభిస్తుంది. కాబట్టి వారికి రిబేట్ పెరిగినట్టే. ఈ లెక్కన కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)