1. మీ ఆధార్ కార్డులో మార్పుల కోసం ఆధార్ సెంటర్కు వెళ్లారా? ఆధార్ సేవా కేంద్రంలో మీ నుంచి ఎక్కువగా ఛార్జీలు వసూలు చేశారా? అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI కి కంప్లైంట్ చేయొచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో లేదా ఆధార్ సెంటర్లో మీ నుంచి ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నట్టైతే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆధార్ సెంటర్లో కొన్ని సేవలు ఉచితం. కొన్ని సేవలకు మాత్రమే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఛార్జీలను కూడా యూఐడీఏఐ నిర్ణయించింది. అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ సెంటర్లతో పాటు ఆధార్ సేవా కేంద్రాల్లో ఛార్జీలు ఒకేలా ఉంటాయి. ఏఏ సేవలకు ఎంత ఛార్జీ చెల్లించాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూఐడీఏఐ 2021 ఏప్రిల్ 12న ప్రకటించిన ఛార్జీలు ఇవి. దేశంలోని అన్ని ఆధార్ సెంటర్లు, ఆధార్ సేవా కేంద్రాల్లో ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో తమ వివరాలు అప్డేట్ చేయడానికి వెళ్తుంటారు. అయితే చాలావరకు ఆధార్ సెంటర్లలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)