ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి సమయం దగ్గర పడుతోంది.ఐటీఆర్ ఫైలింగ్ వ్యవధి మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఐటీ రిటర్న్స్‌ను జూలై 31లోగా దాఖలు చేయాలి. లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి జూలై 31లోగా రిటర్నులు దాఖలు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇది గరిష్టంగా రూ.10,000. అంటే మీ సేవింగ్స్ ఖాతాలో వచ్చే వడ్డీ రూ.10,000 కంటే తక్కువగా ఉంటే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఉంటే పన్ను చెల్లించాల్సిందే. ఈ పన్ను మినహాయింపు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, కోఆపరేటివ్ సొసైటీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లకు వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ NRE అండ్ NRO ఖాతాలు భారతదేశంలోనే ఉండాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, టైమ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సెక్షన్ 80TTA వర్తించదు. అలాగే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సెక్షన్ 80TTA కింద ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ పన్ను మినహాయింపు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా అందుబాటులో ఉండదు.
ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నప్పుడు, పొదుపు ఖాతాలో జమ అయిన వడ్డీ వివరాలన్నీ ఇతర వనరుల విభాగంలోని ఆదాయంలో వెల్లడించాలి. ఆ తర్వాత మొత్తం ఆదాయాన్ని లెక్కించాలి. అప్పుడు సెక్షన్ 80TTA కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)