1. భారత దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి అయినా, పండుగైనా అందరూ పసిడి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపుతారు. పెట్టుబడిగానూ చాలా మంది గోల్డ్‌ను కొంటారు. అందుకే మన దేశంలో బంగారం చాలా అపురూపం. అయితే బంగారం విషయం కొందరు మోసపోతుంటారు. కొందరు మాయమాటలు చెప్పి బంగారమంటూ నకిలీవి అంటగడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. చూసేందుకు బంగారంలా కనిపించినా అవి నకిలీవై ఉంటాయి. మరికొందరు తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఆశచూపి అమ్ముతుంటారు. అలాంటి సమయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏది నకిలీదో.. ఏది అసలు బంగారమో కనిపెట్టగలగాలి. పసిడి నాణ్యతను మన ఇంట్లో ఉండే వాటితోనే పరీక్షించవచ్చు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలివే. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్వచ్ఛమైన బంగారాన్ని అయస్కాంతం ఆకర్షించదు. అయితే మిగిలిన చాలా లోహాలు అయస్కాంతానికి అతుక్కుంటాయి. అందుకే ఇంట్లో ఏదైనా బలమైన అయస్కాంత పదార్థం ఉంటే దాంతో బంగారానికి పరీక్ష పెట్టొచ్చు. బంగారం దగ్గరికి అయస్కాంతం తీసుకెళ్లినప్పుడు ఆకర్షిస్తే అది నకిలీదని అర్థం. ఒకవేళ అయస్కాంతం పెట్టినా.. ఎలాంటి ప్రభావం లేకపోతే అది స్వచ్ఛమైన బంగారం అని నమ్మవచ్చు. అయితే ఇంతటితో ఆగకుండా మరికొన్ని పరీక్షలు కూడా చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. బంగారం నాణ్యతను దానిపై ఉండే హాల్‌మార్క్ తెలియజేస్తుంది. బంగారు ఆభరాణాలు, బంగారు నాణేల క్వాలిటీని నిర్ధారించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను కేంద్రం నెలకొల్పింది. బంగారంపైనే చిన్నగా ఈ బీఐఎస్ మార్కు ఉంటుంది. అందుకే దీని కోసం వెతకాలి. అమ్మే వ్యక్తి చెప్పేంత నాణ్యతతో బంగారం ఉందా అని చెక్ చేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే పసిడి కొనుగోలు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నైట్రిక్ యాసిడ్‌తోనూ బంగారం నిజమైనదో కాదో గుర్తించవచ్చు. నైట్రిక్ యాసిడ్ వేస్తే బంగారంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఈ టెస్టు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులకు గ్లవ్స్ వేసుకోవడంతో పాటు మాస్క్ ధరించాలి. మొదటగా ఆభరణంపై మెల్లగా గీకాలి. ఆ ప్రదేశంలో తక్కువ మొత్తంలో నైట్రిక్ యాసిడ్ వేయాలి. ఒకవేళ దానిపై కేవలం బంగారం కోటింగ్ మాత్రమే ఉండి లోపల వేరే లోహం ఉంటే.. యాసిడ్ వేసిన చోట ఆకుపచ్చగా మారుతుంది. ఒకవేళ నిజమైన బంగారమైతే ఎలాంటి రంగు మారదు. యాసిడ్ రంగులోనే నురగ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. అయితే ఒక్క టెస్టు చేయడం ద్వారానే బంగారం అసలైనదని నిర్ధారించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ చేయడం మంచిది. ఒకవేళ అప్పటికీ అనుమానంగా ఉంటే జ్యువెలరీ షాప్స్‌లో బంగారం నాణ్యతను చెక్ చేయించుకోవచ్చు. అయితే అనుమానం ఉన్న సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాలు కొనకూడదు. నాణ్యమైనదని నిర్ధారించుకున్నాకే కొనాలి. (ప్రతీకాత్మక చిత్రం)