1. స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు ఐపీఓల సబ్స్క్రిప్షన్ బుధవారం ముగిస్తే, మరో రెండు ఐపీఓల సబ్స్క్రిప్షన్ కొనసాగుతోంది. ఆప్టస్ వ్యాల్యూ హౌజింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్, నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ ఐపీఓలు ఈ వారంలో వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇక గత వారం నాలుగు ఐపీఓల సబ్‌స్కిప్షన్ ముగిసింది. దేవ్యానీ ఇంటర్నేషనల్, కృష్ణా డయాగ్నస్టిక్స్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్ సబ్స్క్రిప్షన్ ఆగస్ట్ 6న ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఐపీఓ అలాట్మెంట్ ఈరోజు జరగనుంది. మరి ఐపీఓ స్టేటస్ ఎలా చెక్ చేయాలి. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అన్న వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Devyani International: దేవ్యానీ ఇంటర్నేషనల్ ఐపీఓ స్టేటస్‌ను లింక్ ఇన్‌టైమ్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://linkintime.co.in/MIPO/Ipoallotment.html లింక్ క్లిక్ చేసిన తర్వాత కంపెనీ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, డీపీ క్లైంట్ ఐడీ ఎంటర్ చేయాలి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది. ఆగస్ట్ 16న దేవ్యానీ ఇంటర్నేషనల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. ప్రస్తుతం దేవ్యానీ ఇంటర్నేషనల్ గ్రే మార్కెట్ ప్రీమియం 60 శాతం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Exxaro Tiles: ఎక్సారో టైల్స్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ కూడా లింక్ ఇన్‌టైమ్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. https://linkintime.co.in/MIPO/Ipoallotment.html లింక్‌లోనే పైన చెప్పినట్టుగా అలాట్మెంట్ చెక్ చేయాలి. ఆగస్ట్ 17న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్లు లిస్ట్ అవుతాయి. ఎక్సారో టైల్స్ గ్రే మార్కెట్ ప్రీమియం 10 శాతం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Krsnaa Diagnostics: కృష్ణా డయాగ్నస్టిక్స్ ఐపీఓ స్టేటస్ కేఎఫ్ఇన్టెక్ లింక్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. https://ris.kfintech.com/ipostatus/ipos.aspx లింక్ ఓపెన్ చేసిన తర్వాత IPO Allotment లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కంపెనీ పేరు సెలెక్ట్ చేయాలి. పాన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, డీపీ క్లైంట్ ఐడీలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి. సంబంధిత నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఐపీఓ స్టేటస్ తెలుస్తుంది. ఆగస్ట్ 17న షేర్లు లిస్ట్ అవుతాయి. క్రిష్ణా డయాగ్నస్టిక్స్ గ్రే మార్కెట్ ప్రీమియం 38 శాతం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Windlas Biotech: విండ్లాస్ బయోటెక్ ఐపీఓ స్టేటస్ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ పేరు సెలెక్ట్ చేసి పాన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, డీపీ క్లైంట్ ఐడీలో ఏదైనా ఒకటి ఎంటర్ చేయాలి. ఆగస్ట్ 17న షేర్లు లిస్ట్ అవుతాయి. విండ్లాస్ బయోటెక్ గ్రే మార్కెట్ ప్రీమియం 17 శాతం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక బీఎస్ఈ వెబ్సైట్లో కూడా ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://www.bseindia.com/investors/appli_check.aspx ఓపెన్ చేసిన తర్వాత ఈక్విటీ సెలెక్ట్ చేసి ఐపీఓ పేరు సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)