1. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? రతన్ టాటా (Ratan Tata) పెట్టుబడి పెట్టిన ఓ కంపెనీ ఫ్రాంఛైజీల ద్వారా అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. ఎక్కువమంది వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలనుకుంటే భారీగా పెట్టుబడి కావాలి. కానీ లక్ష రూపాయలు ఉన్నా వ్యాపారం చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అలాంటి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్న సంస్థ జనరిక్ ఆధార్ (Generic Aadhaar). వ్యాపార దిగ్గజం రతన్ టాటా భారీగా పెట్టుబడి పెట్టిన సంస్థ ఇది. జనరిక్ డ్రగ్ స్టార్టప్. ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ (Generic Aadhaar franchise) తీసుకొని లక్షల్లో సంపాదించొచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టి మెడికల్ స్టోర్ ఓపెన్ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కేవలం రూ.1,00,000 పెట్టుబడి చాలు. ఎవరైనా జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజీని రూ.1,00,000 పెట్టుబడితో ఓపెన్ చేయొచ్చు. ఇందులో 40 శాతం వరకు మార్జిన్స్ వస్తాయి. ఈ కంపెనీ 1000 రకాల జనరిక్ మెడిసిన్స్ అందిస్తాయి. ఈ మెడిసిన్‌పై కస్టమర్లకు 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)