1. వ్యాపారం చేయాలంటే నష్టాలు వస్తాయన్న భయం. కానీ కొన్ని వ్యాపారాల్లో లాభాలు తప్ప నష్టాలు ఉండవు. అలాంటి వ్యాపారం ఎంచుకుంటే మంచి లాభాలు సంపాదించొచ్చు. తక్కువ పెట్టుడితో (Low investment business) ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటే ఇంకా మంచిది. మరి మీరు కూడా అలాంటి బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా (Business Idea) గురించి ఆలోచించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆధార్ కార్డ్ గురించి పరిచయం అవసరం లేదు. భారతీయులందరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డ్ అవసరం అవుతోంది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం కూడా ఆధార్ తప్పనిసరే. ఆధార్ కార్డులో తప్పులు ఉండటం కారణంగా ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నవాళ్లు ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అందుకే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం కామన్. ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయించడానికి వెళ్లినప్పుడు అక్కడ ఛార్జీలు ఉంటాయి. ఆ ఛార్జీల ద్వారా ఆధార్ సెంటర్లకు లాభమే. మరి మీరు ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ తీసుకుంటే ఈ లాభం పొందొచ్చు. ఇందుకోసం మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా NSEIT వెబ్సైట్ https://uidai.nseitexams.com/ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Create New User ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్స్, షేర్ కోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆధార్ https://resident.uidai.gov.in/offline-kyc వెబ్సైట్లో ఆఫ్లైన్ ఇ-ఆధార్ వివరాలను డౌన్లోడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకటి రెండు రోజుల్లో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు దగ్గర్లో ఉన్న సెంటర్ బుక్ చేసి అక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఆధార్ రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ పూర్తి చేయాలి. ఆ తర్వాత కామన్ సర్వీస్ సెంటర్లో రిజిస్టర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)