1. జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు గత నెలలో దసరా సందర్భంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట ముంబై, ఢిల్లీ, కోల్కతా, వారణాసిలో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పలు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో ట్రూ 5జీ సేవల్ని ఇటీవల హైదరాబాద్, బెంగళూరులో ప్రారంభించింది రిలయన్స్ జియో. (ప్రతీకాత్మక చిత్రం)
2. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి, నథ్ద్వారా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో వెల్కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 500ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ స్పీడ్తో జియో యూజర్లు తమ స్మార్ట్ఫోన్లలో జియో 5జీ సేవల్ని వాడుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా జియో 5జీ నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు 5G నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే స్మార్ట్ఫోన్లో నెట్వర్క్ స్టేటస్ బార్లో 5G సింబల్ కనిపిస్తుంది. ఇక మీరు జియో 5జీ నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు. 500ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. మీరు 5జీ ఫోన్ ఉపయోగిస్తున్నా, మీకు ఇన్విటేషన్ ఉన్నా, ఈ సెట్టింగ్స్ మార్చినా మీరు 5జీ నెట్వర్క్ ఉపయోగించలేకపోతే ఓసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. జియో ట్రూ 5జీ సేవలు దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. జియో 5జీ నెట్వర్క్ 4జీ నెట్వర్క్పై ఆధారపడదు. అడ్వాన్స్డ్ 5జీ నెట్వర్క్ లభిస్తుంది. 5G కోసం రిలయన్స్ జియో దగ్గర 700MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్లతో అతిపెద్ద, అత్యంత సముచితమైన వైర్లెస్ స్పెక్ట్రమ్ మిక్స్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)