1. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ త్వరలో రానుంది. ఎల్ఐసీ ఐపీఓ సైజ్ రూ.65,400 కోట్లు ఉంటుందన్న వార్తలొస్తున్నాయి. గత నెలలో ఎల్ఐసీ సెబీ దగ్గర డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ఫైల్ చేసింది. డీఆర్‌హెచ్‌పీలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఎల్ఐసీ దగ్గర 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,539 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయని డీఆర్‌హెచ్‌పీలో ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎల్ఐసీ దగ్గర 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.13,843.70 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.16,052.65 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.18,495.32 కోట్లు అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉంటే 2021 సెప్టెంబర్ నాటికి అన్క్లెయిమ్డ్ ఫండ్స్ రూ.21,539 కోట్లకు పెరిగింది. అన్క్లెయిమ్డ్ ఫండ్స్ అంటే పాలసీహోల్డర్లు తమకు రావాల్సిన డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకుండా వదిలేసిన మొత్తం. (ప్రతీకాత్మక చిత్రం)
3. అన్క్లెయిమ్డ్ ఫండ్స్‌లో పాలసీ డబ్బులతో పాటు దానిపై వచ్చే వడ్డీ కూడా కలిపే ఉంటుంది. ఈ మొత్తం ఎల్ఐసీ పాలసీహోల్డర్లదే. ఎల్ఐసీ ప్రతీ గ్రామానికి విస్తరించింది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ ఫ్యామిలీలో ఒకరి పేరు మీదైనా ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్స్ క్లెయిమ్ చేయని ఫండ్స్ వేల కోట్లల్లో ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కొన్నేళ్లు చెల్లించి ఆపేయడం, పాలసీహోల్డర్ మరణించిన తర్వాత నామినీకి, వారి కుటుంబ సభ్యులకు ఎల్ఐసీ పాలసీల గురించి తెలియకపోవడం లాంటి కారణాలతో ఆ పాలసీలు క్లెయిమ్ కావు. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం మొదట్లో చెల్లించి ఆ తర్వాత మర్చిపోయేవారు కూడా ఉంటారు. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత రావాల్సిన డబ్బుల గురించి పట్టించుకోరు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పాలసీహోల్డర్లు క్లెయిమ్ చేసుకోని ఫండ్స్ ఎల్ఐసీ అన్క్లెయిమ్డ్ ఫండ్స్‌లోకి వెళ్తాయి. ఎల్ఐసీ మాత్రమే కాదు... అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు రూ.1,000 లేదా అంతకన్నా ఎక్కువ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటే ఆ వివరాలను తప్పనిసరిగా వెబ్సైట్లో వెల్లడించాలి. వెబ్సైట్లో పాలసీహోల్డర్లు అన్క్లెయిమ్డ్ అమౌంట్ వెరిఫైచేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ప్రకారం పాలసీహోల్డర్ 10 ఏళ్ల తర్వాత కూడా పాలసీ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకపోతే ఆ మొత్తం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కు వెళ్తుంది. మరి మీరు గతంలో ఏవైనా ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కొన్నాళ్లు కట్టి మర్చిపోయినట్టైతే వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి Unclaimed Amounts of Policyholders లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎల్ఐసీ పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)