3. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80సీ పాపులర్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ అనే చెప్పాలి. పన్ను ఆదా చేసే పెట్టుబడులు పెట్టడం ద్వారా లేదా వ్యక్తులు పన్ను తగ్గించుకోవచ్చు. ట్యాక్స్పేయర్స్ మొత్తం ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ.1.5 లక్షల మినహాయింపు పొందొచ్చు. పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUL) ఈ మినహాయింపు పొందవచ్చు. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, LLPలు ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేవు. (ప్రతీకాత్మక చిత్రం)
5. జీవిత బీమా పాలసీలు (సెల్ఫ్, జీవిత భాగస్వామి లేదా పిల్లలు), ప్రావిడెంట్ ఫండ్, గరిష్టంగా ఇద్దరు పిల్లలను చదివించడానికి ట్యూషన్ ఫీజు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనడం లేదా నిర్మాణం, కనీసం 5 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్లు, నాబార్డ్ బాండ్ల కొనుగోలు లాంటివాటిలో పెట్టుబడి పెట్టి సెక్షన్ 80సీ మినహాయింపులు పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద ఒక వ్యక్తి, లేదా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆరోగ్య బీమా కోసం ఖర్చు చేసిన డబ్బుకు మినహాయింపు పొందవచ్చు. వ్యక్తులు 80డీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలపై వారు చెల్లించే ప్రీమియంపైన తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఒకరు తమ పేరు, జీవిత భాగస్వామి పేరు లేదా వారిపై ఆధారపడిన పిల్లల పేరుతో పాలసీ తీసుకుంటే చెల్లించిన ప్రీమియంలో రూ.25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. అదనంగా, తమ తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంను కూడా క్లెయిమ్ చేయొచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటే రూ.25,000, తల్లిదండ్రుల వయస్సు 60 ఏళ్లు దాటితే రూ.50,000 క్లెయిమ్ చేయొచ్చు. ఇక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం చెల్లించే మొత్తంలో రూ.5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)