ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లింక్, రేషన్ నెంబర్ లింక్, వన్ నేషన్ వన్ రేషన్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్" width="875" height="583" /> ఇప్పుడు కొన్ని పనులు పూర్తి కావాలంటే ఆధార్ ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను సంబంధిత పనులకు కూడా ఆధార్ కార్డు ఉండి తీరాల్సిందే. వాలెట్ వినియోగంలో ఆధార్ కార్డ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ నెంబర్ అప్డేట్, ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్" width="1600" height="1600" /> బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్, పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుంటే ఏదైనా ముఖ్యమైన పని చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది. కానీ అనేక మొబైల్ నంబర్లు, అనేక బ్యాంకు ఖాతాలు ఉండొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
అందుకే చాలాసార్లు ఆధార్ కార్డు ఏదైనా బ్యాంకు ఖాతాతోనో, మొబైల్ నంబర్తోనో లింక్ అయ్యిందా అనే సందేహాలు ఏర్పడుతుంటాయి. అయితే మన ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి బ్యాంక్ లేదా ఆధార్ కార్డ్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఆన్లైన్లో ఏ బ్యాంక్ ఖాతా నుండి ఆధార్ కార్డ్ లింక్ చేయబడిందో ఆన్లైన్లో కనుగొనవచ్చు.
ఇందుకోసం ముందుగా UIDAI www.uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీ ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాను చెక్ చేయండి అనే లింక్‌పై ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ మరియు సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.UIDAI వెబ్సైట్లో ఈ OTPని నమోదు చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)