1. మీరు క్రెడిట్ కార్డ్ యూజరా? మూడు నాలుగు క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడుతున్నారా? ప్రతీ నెలా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తున్నారా? క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే తేదీ గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు. గడువు దాటిన తర్వాత బిల్ చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్ పేమెంట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇందుకు కారణం బిల్ జనరేట్ అయ్యే డేట్. బిల్ జనరేట్ అయిన 20 రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా బిల్ చెల్లించకపోతే పెనాల్టీ, వడ్డీ భారం పడుతుంది. ఒకసారి బిల్లింగ్ సైకిల్ ఫిక్స్ అయిందంటే ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయ్యేవరకు అందులో మార్పు ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉదాహరణకు ఓ వ్యక్తి ఏదైనా ఓ బ్యాంకులో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకుందాం. ప్రతీ నెల 5వ తేదీన బిల్ జనరేట్ అవుతుంది. 5న బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత బిల్ పేమెంట్ చేయడానికి 20 రోజుల సమయం ఉంటుంది. అంటే ఆ నెల 25వ తేదీన బిల్ చెల్లించాలి. అంటే మంత్ ఎండింగ్లో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. వేతనాలు పొందే ఉద్యోగులకు మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులకు ఇబ్బంది ఉండటం మామూలే. అలాంటి సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడం అంటే సాధ్యమయ్యే పనికాదు. ఇందుకోసం అప్పు చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎదుర్కొంటున్న సమస్య ఇది. బిల్ జనరేట్ అయ్యే తేదీని మార్చాలని యూజర్లు రిక్వెస్ట్ చేసినా బ్యాంకులు పట్టించుకోవు. దీంతో క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ విషయం గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ బిల్లింగ్ సైకిల్ ఒకసారి మార్చుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు ఇకపై స్టాండర్డ్ బిల్లింగ్ సైకిల్ పాటించకుండా, కస్టమర్లు సొంతగా బిల్లింగ్ పీరియడ్ ఎంచుకునేలా అనుమతి ఇవ్వాలి. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం సదరు వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యే తేదీని ప్రతీ నెల 5వ తేదీకి బదులు 20వ తేదీని ఎంచుకున్నారనుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
7. అప్పుడు బిల్ చెల్లించడానికి 20 రోజుల సమయం ఉంటుంది. అంతలోగా సాలరీ వస్తుంది కాబట్టి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయొచ్చు. ఇలా క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండేలా బిల్లింగ్ సైకిల్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ వెసులుబాటును ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలన్న ఒత్తిడి తగ్గించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి ఇలా మార్చుకోవచ్చనుకుంటే పొరపాటే. రెండుమూడు క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. వేర్వేరు క్రెడిట్ కార్డులకు వేర్వేరు బిల్లింగ్ సైకిల్స్ కాకుండా, ఒకే బిల్లింగ్ సైకిల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)