1. క్రెడిట్ కార్డును బ్యాంకులు తిరస్కరిస్తే కార్డు తిరస్కరించడానికి గల కారణాలను రాతపూర్వకంగా కస్టమర్‌కు వెల్లడించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ (Credit Card) పోగొట్టుకున్నా, కార్డ్ మోసాలకు గురైనా ఇన్స్యూరెన్స్ కవర్ పొందే ఆప్షన్ అందించాలి. కస్టమర్ల అనుమతి లేకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని అప్‌గ్రేడ్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే డెబిట్ కార్డుల్ని జారీ చేయాలి. క్రెడిట్ అకౌంట్, లోన్ అకౌంట్ హోల్డర్స్‌కు డెబిట్ కార్డ్స్ ఇవ్వకూడదు. అయితే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలకు లభించే ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని డెబిట్ కార్డ్‌తో లింక్ చేయకుండా బ్యాంకులు నిరోధించకూడదు. కస్టమర్లు డెబిట్ కార్డ్ తీసుకోవాలని బ్యాంకులు ఒత్తిడి చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే విషయంలో కస్టమర్ల రిక్వెస్ట్‌లకు బ్యాంకులు వెంటనే స్పందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్, ఇమెయిల్ ఐడీ, ఐవీఆర్, వెబ్సైట్, యాప్స్‌లో లింక్స్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడంలో జాప్యం జరిగితే రోజుకు రూ.500 చొప్పున కస్టమర్లకు బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు క్రెడిట్ కార్డ్హోల్డర్లకు ఛార్జీలు, వడ్డీ ఎలా లెక్కిస్తారో ఉదాహరణలతో వివరించాల్సి ఉంటుంది. రిటైల్ కొనుగోళ్లు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, క్యాష్ అడ్వాన్స్‌లు, మినిమమ్ అమౌంట్ డ్యూ చెల్లించకపోవడం, లేట్ పేమెంట్ సందర్భాల్లో ఛార్జీలు, వడ్డీ ఎలా ఉంటుందో వార్షిక పర్సంటేజ్ రేట్లను (APR) వివరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ స్టేట్మెంట్స్ని పంపించడంలో జాప్యం చేయకూడదు. ఆలస్యమైన బిల్లింగ్ ఫిర్యాదులను తొలగించడానికి, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్ సమ్మతితో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లులు, స్టేట్మెంట్లను పంపాలి. తప్పుడు బిల్లులు పంపకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు సమ్మతి లేకుండా రుణాలు లేదా ఇతర క్రెడిట్ సౌకర్యాలు అందించకూడదు. వ్రాతపూర్వక అనుమతి లేకుండా క్రెడిట్ సదుపాయం పొడిగిస్తే, కార్డు జారీచేసినవారు ఆ సదుపాయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా జరిమానా చెల్లించాలి. క్రెడిట్ లిమిట్ పెంపు, క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. క్రెడిట్ కార్డ్ హోల్డర్ డిఫాల్ట్ అయినట్టు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి నివేదించే ముందు, కార్డ్ జారీచేసినవారు తమ బోర్డు ద్వారా ఆమోదించబడిన విధానానికి కట్టుబడి ఉన్నట్టు నిర్ధారించుకోవాలి. అటువంటి కార్డ్ హోల్డర్‌కు ఏడు రోజుల నోటీసు వ్యవధిని జారీ చేయడం కూడా అవసరం. ఒకవేళ కస్టమర్ బకాయిలను సెటిల్ చేస్తే, 30 రోజుల్లోపు స్టేటస్ అప్డేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)