2. మీరు షాపింగ్‌కు వెళ్తే జేబులో వేలకు వేలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. క్యాష్ మెయింటైన్ చేయాల్సిన పనిలేదు. క్రెడిట్ కార్డ్ తీసుకెళ్తే చాలు. ప్రతీ చోటా ఇప్పుడు కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డ్ తీసుకెళ్లినా పని జరుగుతుంది. కానీ క్రెడిట్ కార్డు వాడితే మీకు తెలియని లాభాలుంటాయి.
3. ఉదాహరణకు మీ మంత్లీ బడ్జెట్ రూ.50,000 అనుకుందాం. 1వ తేదీన జీతం పడగానే ఖర్చు చేయడం అలవాటు. ఆ డబ్బును అలాగే అకౌంట్లో ఉంచండి. మీ క్రెడిట్ కార్డును మీ మంత్లీ బడ్జెట్‌కు వాడుకోండి. మీకు బిల్ చెల్లించడానికి 45 రోజుల గడువుంటుంది. రూ.50,000 క్యాష్‌ను అకౌంట్లో 45 రోజులు అలాగే ఉంచినందుకు మీకు బ్యాంకు ఎంతోకొంత వడ్డీ చెల్లిస్తుంది. సో... ఆ వడ్డీ మీకు లాభమే.
4. క్రెడిట్ కార్డును క్రమశిక్షణతో వాడితే మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. 30-40% నియమాన్ని పెట్టుకోవాలి. అంటే మీకు ఉన్న క్రెడిట్ లిమిట్లో 30-40% మించి ఖర్చు చేయొద్దు. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష అయితే రూ.30-40 వేల మధ్యే వాడుకోవాలి. దీని వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. భవిష్యత్తులో ఏదైనా లోన్‌కు అప్లై చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది.
6. క్రెడిట్ కార్డ్ తీసుకున్న వారికి ఎయిర్పోర్ట్ లాంజ్‌లో కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇస్తాయి బ్యాంకులు. డొమెస్టిక్ డెస్టినేషన్స్‌తో పాటు ఇంటర్నేషనల్‌లో కూడా లాంజ్‌లో కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందొచ్చు. ఏదైనా ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు మీ కార్డు స్వైప్ చేసి లాంజ్‌లో తీరొచ్చు. హై ఎండ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే గోల్ఫ్ కోర్స్‌లోకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు... అక్కడ గోల్ఫ్ పాఠాలూ ఉచితంగా నేర్చుకోవచ్చు.