బీఎండబ్ల్యూ ఐ4 కారు అధిక రేంజ్ కలిగి ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ కారు ఏకంగా 590 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ కారు కొంటే బీఎండబ్ల్యూ వాల్ బాక్స్ చార్జర్, ఇన్స్టాలేషన్ ఉచితంగా పొందొచ్చు. కేవలం 31 నిమిషాల్లోనే ఈ కారు బ్యాటరీ 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. 205 కేడబ్ల్యూ డీసీ చార్జర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 50 కేడబ్ల్యూ డీసీ చార్జర్ వాడితే 83 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. 11 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ అయితే 8.25 గంటలు పడుతుంది.
ఇంకా జాగ్వర్ ఐ పేస్ కారు కూడా ఉంది. దీని రేంజ్ 470 కిలోమీటర్లు. అంటే ఒక్కసారి చార్జ్ పెడితే 470 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఈ కారు మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.
కియా ఈవీ6 అనే ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. దీని రేంజ్ 528 కిలోమీటర్లు. కియా తొలి ఎలక్ట్రిక్ కారకు ఇదే. ఈ కారు స్పెషల్ జీటీ లైన్ వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 400 వీ, 800 వీ చార్జర్స్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది. 800 వీ చార్జర్ ఆప్షన్ అయితే 10 నుంచి 80 శాతం బ్యాటరీ 18 నిమిషాల్లో ఫుల్ అవుతుంది. ఈ కారు 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 5.2 సెకన్లలోనే అందుకుంటుంది.
ఈ కార్లు అన్నీపెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించినవి. రేటు కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అదే అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని భావించే వారు టాటా మోటార్స్ వంటి కార్లను పరిశీలించొచ్చు. వీటి రేటు అందుబాటులో ఉంటుంది. అయితే రేంజ్ కూడా తక్కువ ఉండొచ్చు. కాగా చాలా కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ కారు కొనే వారు కొంత కాలం ఆగితే బాగుటుంది.