1. కియా అమ్మకాలను(Kia Sales) పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. కియా ఇండియా(Kia India) మన దేశంలో సోనెట్ CNG వెర్షన్‌ను పరీక్షించడం ప్రారంభించింది. కియా నుంచి రాబోయే సోనెట్ CNG వెర్షన్‌ను ఇండియాలో టెస్ట్ చేస్తుండగా కెమెరాలకు(Camera) చిక్కింది. దీంతో ఈ మోడల్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. కియా సోనెట్ పెట్రోల్ వేరియంట్లో 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారు ఉంటుంది. ఇది 118 hp శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అయితే బై-ఫ్యూయెల్ CNG వేరియంట్ తక్కువ శక్తి, టార్క్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5.సోనెట్ మోడల్ 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారుతో పాటు 82 hp 1.2-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 98 hp / 113 hp 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్లో 5-స్పీడ్ MT, డీజిల్ వేరియంట్లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ / 6-స్పీడ్ AT ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం భారతదేశంలో CNG సబ్-కాంపాక్ట్ SUV అమ్మకంలో లేనప్పటికీ.. కియాతో పాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ నుంచి కూడా ఇలాంటి కార్లను చూసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సరికొత్త సీఎన్జీ వేరియంట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. (ప్రతీకాత్మక చిత్రం)