1. ఆటో ఎక్స్పో 2023 ఈవెంట్లో తొలిరోజు కియా కంపెనీ ఆకట్టుకుంది. కొన్ని కొత్త ఆవిష్కరణలతోపాటు ప్రస్తుత ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించింది. సస్టైనబుల్ మొబిలిటీ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ కొరియన్ ఆటో దిగ్గజం న్యూ జనరేషన్ కార్నివాల్ MPV మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. కొత్త మోడల్‌ను KA4 పేరుతో ఆవిష్కరించింది. (Photo: Paras Yadav/News18.com)
2. ఇది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే కొత్త MPV సైజ్ పెరిగింది. కారు లోపల ఎక్కువ స్పేస్, 11 సీటింగ్ ఆప్షన్లను అందిస్తుంది. MPV డిజైన్‌తో పాటు ఫీచర్ల పరంగా కూడా అప్డేట్లు పొందింది. కియా త్వరలో కొత్త MPV ధరను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. (Photo: Paras Yadav/News18.com)
3. కియా తొలిసారిగా కార్నివాల్ MPVని 2020 ఆటో ఎక్స్పో లాస్ట్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. గత మూడు సంవత్సరాలలో ఈ లగ్జరీ MPVకి ఒక చిన్న ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ కూడా వచ్చింది. కార్నివాల్ 2023 లేదా KA4 అనేది MPVలో ఫోర్త్ జనరేషన్ మోడల్. ఇది మల్టీ బ్లూటూత్ కనెక్టివిటీ, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, డ్యూయల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు, టెక్నాలజీతో రానుంది. (Photo: Paras Yadav/News18.com)
4. కొత్త KA4లో బ్రౌనీ వీల్ ఆర్చెస్, ఫ్రంట్, రియర్ లైటింగ్‌లను కలుపుతూ ప్రొనౌన్స్డ్ కట్లైన్ ఉంటాయి. లగ్జరీ MPVలో లార్జ్ టూ-టోన్ మిర్రర్లు, బ్లాక్/క్రోమ్ సైడ్ ప్యానెల్ మోల్డింగ్స్ కూడా ఉంటాయి. ఇది స్కిడ్ ప్లేట్, రిఫ్లెక్టర్స్, కంప్లీట్లీ LED టెయిల్లైట్లు, సరికొత్త రియర్ బంపర్‌తో వస్తుంది. ఈ లేటెస్ట్ మోడల్ 17, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రన్ అవుతుంది. (Photo: Paras Yadav/News18.com)
5. కియా ఈ ప్రీమియం MPVని 3.5L V6 MPi పెట్రోల్ ఇంజిన్, కొత్త 2.2L స్మార్ట్‌స్ట్రీమ్ ఇంజిన్, 3.5L GDi V6 స్మార్ట్‌స్ట్రీమ్ ఇంజిన్ వేరియంట్లలో అందిస్తుంది. 3.5L పెట్రోల్ ఇంజిన్ 332 nm తో 268 bhp పవర్‌ను అందిస్తుంది. 2.2L, 3.5L స్మార్ట్ స్ట్రీమ్ మోటార్లు వరుసగా 355 nmతో, 290 bhp, 440 nmతో 199 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇండియాలో లాంచ్ అయ్యే 2.2L డీజిల్ ఇంజిన్ 440 Nmతో 200 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో రానుంది. (Photo: Paras Yadav/News18.com)
6. ఫోర్త్ జనరేషన్ కార్నివాల్ KA4 పూర్తిగా కొత్త ఇంటీరియర్‌తో వస్తుంది. MPV ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు ఉంటాయి. వుడ్ ట్రిమ్‌తో సరికొత్త డ్యాష్‌బోర్డ్ అందిస్తున్నారు. డ్యూయల్-టోన్ బీజ్, బ్రౌన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లో సరికొత్త డిజైన్ ఇంట్రడ్యూస్ కానుంది. కొత్త KA4 ఇప్పటికీ మల్టీ-జోన్ టెంపరేచర్ కంట్రోల్, మోటరైజ్డ్ ఫోల్డింగ్ రియర్ డోర్స్, ట్విన్ సన్‌రూఫ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది. (Photo: Paras Yadav/News18.com)
7. సేఫ్టీ ఎక్విప్మెంట్ పరంగా KA4లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ADAS) ఫీచర్లు ఉంటాయి. వీటిలో ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్(FCA), బ్లైండ్-స్పాట్ అవాయిడెన్స్ అసిస్ట్(BCA), రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్(RCCA), పార్కింగ్ డిస్టెన్స్ వార్నింగ్-రివర్స్(PDW-R), లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్(LKAS), హై బీమ్ అసిస్ట్ (HBA), డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (DAW) ఉన్నాయి. (Photo: Paras Yadav/News18.com)