1. కియా మోటార్స్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో కారెన్స్ (Kia Carens) కార్ రిలీజైన సంగతి తెలిసందే. ఈ కారు ధరను ఇప్పటికే రూ.70,000 వరకు పెంచింది. ఇప్పుడు మరో రూ.50,000 పెంచింది. దీంతో కియా కారెన్స్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10 లక్షలు దాటింది. పెరిగిన ధరలు నవంబర్ నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. (image: Kia Motors)
3. ప్రస్తుతం కియా కారెన్స్ బేస్ మోడల్ కొనాలంటే రూ.10 లక్షల పైనే ఖర్చు చేయాలి. ఇక టాప్ ఎండ్ Diesel 6AT Luxury plus 7 సీట్ వేరియంట్ కొనాలంటే రూ.17.99 లక్షలు చెల్లించాలి. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. కియా లాంఛ్ చేసిన కార్లలో కారెన్స్ మోడల్‌కు మంచి క్రేజ్ లభించింది. సెల్టోస్, సోనెట్ తర్వాత మూడో బెస్ట్ సెల్లర్‌గా కియా కారెన్స్ నిలిచింది. (image: Kia Motors)
4. గత నెలలో కియా కారెన్స్ 5,479 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇక కొత్తగా కియా కారెన్స్ బుక్ చేసుకుంటే డెలివరీ కోసం 75 వారాలు వెయిట్ చేయాలి. భారతదేశంలో అమ్ముడుపోతున్న కార్లల్లో ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారు ఇదే. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్న ప్రెస్టీజ్ వేరియంట్ కోసం 74 వారాల నుంచి 75 వారాలు వెయిట్ చేయాలి. (image: Kia Motors)
5. కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ పేర్లతో ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. గ్లేసియర్ వైట్ పెరల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే, అరోర బ్లాక్ పెరల్, ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. (image: Kia Motors)
6. కియా కారును 1.5 పెట్రోల్, 1.4 పెట్రోల్, 1.5 డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో కొనొచ్చు. సీటింగ్ విషయానికి వస్తే ఆరు లేదా ఏడు సీటింగ్ ఆప్షన్స్‌తో ఈ కారు కొనొచ్చు. మూడు డ్రైవింగ్ మోడ్స్ సపోర్ట్, త్రీ రో సీటింగ్, కియా సిగ్నేచర్ గ్రిల్, ఎలక్ట్రిక్ పవర్ ఫోల్డింగ్ సీట్స్, యాంబియెంట్ మూడ్ లైటింగ్, 8 స్పీకర్ బోస్ మ్యూజిక్ సిస్టమ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైమ్మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Kia Motors)
7. కియా కారెన్స్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలను కంపెనీ పరిష్కరించనుంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం వీఎస్ఎం, టీపీఎంఎస్, డిస్క్ బ్రేక్స్ లాంటి అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. (image: Kia Motors)