కియా సీపీవో ద్వారా కస్టమర్లకు రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. లేదంటే గరిష్టంగా 40 వేల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. ఇంకా ఈ కియా సీపీవోలో నాన్ కియా మోడల్స్ కూడా అందుబాటులో ఉంటయి. ఇంకా నాలుగు ఉచిత మెయింటెనెన్స్ సర్వీసులు కూడా పొందొచ్చు. కియా కారు కొనుగోలు చేసిన వారిలో చాలా మంది పాత కారు రిప్లేస్మెంట్ పొందారని, అందుకే ఇప్పుడు సొంతంగా సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చామని కంపెనీ చీఫ్ సేల్స్ ఆఫీసర్ మైయుంగ్ సిక్ సోహ్న్ తెలిపారు.