1. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) వందల సంఖ్యలో బస్సులు నడపనుంది. పంబా, శబరిమల వెళ్లే గ్రూప్ బుకింగ్ సిస్టమ్ కూడా ప్రారంభించనుంది కేఎస్ఆర్టీసీ. ఈ విషయాన్ని కేరళ రవాణా శాఖ మంత్రి కొద్ది రోజుల క్రితమమే ప్రకటించారు. 40 మంది భక్తులు ఒక గ్రూప్‌గా బస్సు బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేరళ ఆర్టీసీ నీలక్కల్ నుంచి పంబా వరకు నిమిషానికి ఓ బస్సు ఆపరేట్ చేయనుంది. వృద్ధులు వాహనం ఎక్కేందుకు ప్రత్యేక క్యూ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. నీలకల్ - పంబా చైన్ సర్వీస్ ద్వారా 200 బస్సులు నడుస్తాయి. రాష్ట్రంలోని వివిధ కేంద్రాల నుంచి పంబా వరకు 300 బస్సులు, మకరవిళక్కు కోసం 1000 బస్సులు నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పంబాకు 300 బస్సులు నడపనున్నారు. మకరవిలక్కు పూజ సమయానికి 1000 బస్సుల్ని నడపనున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా. భద్రతా దృష్ట్యా గూడ్స్ వాహనాలు, ఆటో రిక్షాలు పంబా వైపు రాకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి శబరిమలకు భక్తులు వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ఎరుమేలి నుంచి సుమారు 61 కి.మీ దూరం సాంప్రదాయ పర్వత అటవీ మార్గం ద్వారా వెళ్తుంటారు. వండిపెరియార్ నుంచి 12.8 కి.మీ, చలకాయం నుండి 8 కి.మీ దూరం ప్రయాణిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)