3. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరడానికి 2023 మార్చి 31 వరకే గడువు ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి 7.40 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా రూ.15,00,000 పొదుపు చేస్తే వార్షికంగా రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. అంటే ఈ లెక్కన ప్రతీ నెలా రూ.9,250 పెన్షన్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో భార్యాభర్తలు రూ.30,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇద్దరికీ కలిపి గరిష్టంగా రూ.18,500 పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేవారికి కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000 లభిస్తుంది. మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, సంవత్సరానికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు. ఇందుకోసం కనీసం రూ.1,62,162 ఇన్వెస్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)