1. బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ గోల్డ్ (22 carat gold price), స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారెట్ గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Prices) కూడా రికార్డు ధర వైపు పరుగులు తీస్తోంది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో గిఫ్ట్ ఇవ్వడానికి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ (One gram gold coin) కొనేవారు ఉంటారు. వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్‌కు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. గతంలో బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు రూ.4,000 లోపే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు బంగారం ధర భారీగా పెరగడంతో వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనాలంటే రూ.6,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. (image: Amazon India)
3. బంగారం ధరలు పెరిగిపోవడంతో వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్‌కు డిమాండ్ తగ్గుతోంది. దీంతో వ్యాపారులు తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కాకుండా హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ నగల షాపుల్లో కొత్తగా కనిపిస్తున్నాయి. (image: Amazon India)
4. ప్రజలు బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించడానికి, బహుమతులు ఇచ్చేందుకు కొనడానికి హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్‌ని లాంఛ్ చేస్తున్నారు నగల వ్యాపారులు. డబ్బులు ఉన్నప్పుడు కొంత బంగారం కొనాలనుకునేవారికి హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అనుకూలంగా ఉంటున్నాయి. వీటిని కొనేందుకు కస్టమర్లు ముందుకు వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో కూడా హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కనిపిస్తున్నాయి. ఇవి సుమారు రూ.3,000 ధరలో అందుబాటులో ఉన్నాయి. ఒక గ్రాము కోసం రూ.6,000 ఖర్చు చేయడం కన్నా రూ.3,000 చెల్లించి 0.5 గ్రామ్ గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువగా ఉంటారు. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారులు వీటిని తయారు చేస్తున్నారు (image: Amazon India)
6. ఇక బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.49,350 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన బంగారం అయిన 24 క్యారట్ గోల్డ్ 10 ధర రూ.350 పెరిగి రూ.53,840 ధరకు చేరుకుంది. 2020 ఆగస్టు 7న 24 క్యారట్ బంగారం రూ.59,130 ధరకు, 22 క్యారట్ బంగారం రూ.54,200 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)