2. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టేవారైనా సరే... ఈ టెక్నిక్‌ను అర్థం చేసుకొని అమలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. పొదుపు పెంచుకోవచ్చు. అసలు కాకీబో అంటే ఏంటంటే... ఇంటి జమాఖర్చుల్ని రాసే పుస్తకం అని అర్థం. 1904 సంవత్సరంలో హని మొటోకో అనే మహిళ కాకీబో టెక్నిక్‌ను పరిచయం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఏదైనా ఓ వస్తువు కొనాలనుకునే ముందు ఈ 7 ప్రశ్నలు మీకు మీరే వేసుకోవాలి. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా? నా ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా? నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా? ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లో స్థలం ఉందా? ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను? ఈ రోజు నా మానసిక స్థితి ఎలా ఉంది? ఈ వస్తువు కొన్న తర్వాత నేను ఎలా ఉంటాను? అనే ప్రశ్నల్ని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇలా మీరు ఏ వస్తువు కొనాలనుకున్నా, ఏ ఖర్చు చేయాలనుకున్నా, ఎక్కడైనా టూర్ వెళ్లాలనుకున్నా, సినిమాకు వెళ్లాలన్నా ఈ ప్రశ్నలు వేసుకోండి. మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఇలా పొదుపు చేసిన డబ్బును మీరు మీ సేవింగ్స్ వైపు మళ్లించండి. మీకు తెలియకుండానే కొన్నేళ్లలో లక్షలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)