Electric two-wheeler : ధర తక్కువ.. స్పీడ్ ఎక్కువ.. ఐవూమీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్
Electric two-wheeler : ధర తక్కువ.. స్పీడ్ ఎక్కువ.. ఐవూమీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్
Electric two-wheeler : ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో మరో మోడల్ చేరింది. ఐవూమీ కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. ఎక్కువ స్పీడ్‌తో వెళ్లడం ఈ స్కూటర్ల ప్రత్యేకతగా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే కంపెనీ ఐవూమీ ఎనర్జీ (iVOOMi).. ఇండియాలో S1 మోడల్లో కొత్త ఈ-స్కూటర్లను ఇండియాలో వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.69,999 నుంచి రూ.1,21,000 రేంజ్లో ఉంది. (image credit - https://ivoomienergy.com/)
2/ 9
ఈ కొత్త హై స్పీడ్ స్కూటర్లు 3 కలర్స్‌లో లభిస్తున్నాయి. అవి పీకాక్ బ్లూ, నైట్ మెరూన్, డస్కీ బ్లాక్ అని కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. (image credit - https://ivoomienergy.com/)
3/ 9
"భారతీయ వినియోగదారుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ S1 సిరీస్ స్కూటర్లను తీసుకొచ్చాం. ఉన్నత ప్రమాణాలు పాటించాం. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడేందుకు వీలుగా వీటిని తీసుకొచ్చాం" అని ఐవూమీ కంపెనీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు సునీల్ బన్సాల్ తెలిపారు. (image credit - https://ivoomienergy.com/)
4/ 9
కంపెనీ ప్రకారం S1 240 ఈ-స్కూటర్ 240 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది. ఇందులో 4.2 kWhల రెండు బ్యాటరీల ప్యాక్ ఉంటుంది. ఇది 2.5 kW మోటర్.. ఎక్స్ట్రా టార్క్ కలిగివుంది. (image credit - https://ivoomienergy.com/)
5/ 9
ఇక S1 80 ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లుగా ఉంది. దీనికి 2.5kWల హబ్-మౌంటెడ్ మోటర్ ఉంది. (image credit - https://ivoomienergy.com/)
6/ 9
S1 సిరీస్‌లో వచ్చే అన్ని స్కూటర్లకూ 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి ఎకో, రైడర్, స్పోర్ట్. ఎవరికి ఎలాంటి వేగం కావాలో అది ఎంచుకోవచ్చు. (image credit - https://ivoomienergy.com/)
7/ 9
ఈ కొత్త స్కూటర్లలో ఫైండ్ మై రైడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది జీపీఎస్ ట్రాకర్ కలిగివుంటుంది. తద్వారా మాల్స్, మార్కెట్ ప్రదేశాల్లో స్కూటర్ ఎక్కడుందో ఇట్టే కనిపెట్టవచ్చు. (image credit - https://ivoomienergy.com/)
8/ 9
S1 సిరీస్ లోని ఎలక్ట్రిక్ టూవీలర్లు.. డిసెంబర్ 1 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయనీ.. దేశవ్యాప్తంగా ఐవీమూ డీలర్షిప్స్ దగ్గర ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది. (image credit - https://ivoomienergy.com/)
9/ 9
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (image credit - https://ivoomienergy.com/)