రిటర్న్స్ ఫైల్ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది. మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, పన్ను లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు 2022లో పుంజుకున్నాయి. కొత్త సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలకు పెద్ద పీట వేయనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ ఎకానమీపై పన్ను విధించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పన్నుల్లో న్యాయమైన వాటాను పొందేలా చేయడం, క్రిప్టోకరెన్సీలపై పన్ను విధించడానికి ప్రపంచ దేశాల సహకారం ఇండియా ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండనుంది. ఎందుకంటే భారతదేశం వచ్చే ఏడాది G-20 దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్ట్రక్చర్‌లో మార్పు
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ రేషనలైజేషన్ ద్వారా అసెట్ క్లాసెస్ మధ్య హోల్డింగ్ వ్యవధిలో సమానతను తీసుకువస్తుందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక సంవత్సరానికి పైగా హోల్డ్ చేసిన షేర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 10 శాతం పన్ను చెల్లించాలి. స్థిరాస్తి, 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఉన్న లిస్టెడ్ షేర్లు, 3 సంవత్సరాలకు పైగా ఉన్న డెట్ ఇన్స్ట్రూమెంట్స్, ఆభరణాల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై 20 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి.
ఎగ్జమ్షన్ ఫ్రీ ట్యాక్స్ విధానాన్ని వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మరింత ఆకర్షణీయంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పన్ను విధానంలో దీనికి సంబంధించి మార్పులు ఉండవచ్చు. లాంగ్ టర్మ్‌లో.. ఎగ్జమ్షన్లు, డిడక్షన్లు లేని కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సంక్లిష్టమైన పాత పన్ను విధానాన్ని తొలగించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
ఆ దిశగా కదులుతున్న ప్రభుత్వం 2020-21 యూనియన్ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు వివిధ ఎగ్జమ్షన్లు, డిడక్షన్లతో కూడిన పాత పన్ను విధానం లేదా ఎగ్జమ్షన్లు, డిడక్షన్లు లేని తక్కువ పన్ను రేట్లు ఉండే కొత్త పన్ను విధానం మధ్య ఒకటి ఎంచుకోవాలనే ఆప్షన్ కల్పించింది. ఇది అమల్లోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కొత్త పన్ను విధానం ఊపందుకోలేదు. దీనికి సంబంధించి అవసరమైన మార్పులు తీసుకొచ్చే యోచనలో I-T శాఖ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17 వరకు ప్రత్యక్ష పన్నుల (రీఫండ్లు అడ్జస్ట్ చేయడానికి ముందు) గ్రాస్ కలెక్షన్ రూ.13.63 లక్షల కోట్లుగా ఉంది. ముందస్తు పన్ను చెల్లింపు, TDS డిడక్షన్లలో బలమైన వృద్ధి కారణంగా 2021-22 కాలంలో 26 శాతం వృద్ధి కనిపించింది. రీఫండ్ల కోసం సర్దుబాటు చేసిన తర్వాత, కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయాలపై ట్యాక్స్ నెట్ కలెక్షన్ దాదాపు 20 శాతం పెరిగి రూ.11.35 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది పూర్తి సంవత్సర బడ్జెట్ లక్ష్యంలో 80 శాతం కావడం గమనార్హం.
కామన్ ఐటీఆర్ ఫారమ్
పన్ను చెల్లింపుదారుల పనిని సులభతరం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(DBDT) కామన్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(ITR) ఫారమ్‌ను ప్రపోజ్ చేసింది. ఫారం-7 మినహా అన్ని ఐటీఆర్ ఫారమ్‌లను విలీనం చేయాలని CBDT భావిస్తోంది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు సోర్స్, లెవల్, ఇన్‌కం నేచర్ వంటి అంశాలపై ఆధారపడి ITR-1 నుంచి ITR-7 వరకు ఫారమ్‌లను ఎంచుకోవాలి. ప్రస్తుత ITRలు నిర్దేశిత ఫారమ్‌ల రూపంలో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో నిర్దిష్ట షెడ్యూల్ వర్తిస్తుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా అన్ని షెడ్యూల్ల ద్వారా వెళ్లవలసి ఉంటుంది. ఇది ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఫారమ్‌లు (ITR-1 మరియు 4) కొనసాగుతాయి. కరోనా రికవరీ బడ్జెట్, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం రెండో టర్మ్‌లో తీసుకొస్తున్న చివరి పూర్తి-సంవత్సర బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ప్రత్యేకమైనదని నాంగియా ఆండర్సన్ LLP భాగస్వామి సందీప్ జున్‌జున్‌వాలా అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)