ఎవర్నైనా డబ్బు సాయం కోరితే మాకేమైనా డబ్బు చెట్లకు కాస్తున్నాయా అంటారు. అది మాట్లాడటానికి పెద్దగా ఆధారాలు అవసరం లేకపోయినా..నిజంగా డబ్బులు కాస్తున్న చెట్లు ఉన్నాయి. ఇది నమ్మలేని నిజం. కాకపోతే కరెన్సీ నోట్లు చెట్లకు కాయవు. ఆ చెట్ల ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మేం చెబుతున్నాం. ఎందులోనైనా ఓపిక, సహనం వహిస్తే దాని ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది.(File Photos)
ఇప్పుడు మేం చెప్పబోతున్న విషయం ఏమిటంటే కొన్ని రకాల మొక్కలను నాటితే అవి 8-10 సంవత్సరాల తర్వాత చెట్టుగా మారి కోట్ల రూపాయల డబ్బులు కురిపిస్తుంది. ఒక్కసారి చెట్టు పెరగిన తర్వాత కేవలం ఆదాయం మాత్రమే పొందవచ్చు అనడానికి ఈ ఐదు రకాల చెట్ల గురించి తెలుసుకోవాలి. వాటిని నాటడం వల్ల ఎంత లాభం వస్తుందో మీకే అర్దమవుతుంది. (File Photos)
టేకు చెట్టు :ఈ చెట్టు కలపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అత్యంత ధృడమైన కలపగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇంటి నిర్మాణంతో పాటు ఫర్నీచర్, డెకరేషన్ వంటి వస్తువులను తయారు చేయడానికి దీనికే ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే టేకు చెట్టును కలప రాజుగా పిలుస్తారు. ఈ చెట్టు పెరగడానికి 10-12ఏళ్లు పడుతుంది. దాని వల్ల 25-30 వేల రూపాయల ఆదాయం వస్తుంది.
కుండ చెట్టు: ఈ రకం చెట్టను ఎకరం పొలంలో నాటడం ద్వారా కోటి రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. ఇది ఔషధ వృక్షమే కాకుండా దాని కర్రలు కూడా తినదగినవిగా ఉంటాయి. ఈ చెట్టు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ చెట్లు వాటి చుట్టూ ఉన్న నేలలో నత్రజని మరియు భాస్వరం కలుపుతాయి. ఇది పంట దిగుబడిని మెరుగుపరుస్తుంది.