1. మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే కొత్త డెబిట్ కార్డ్ వచ్చిందా? కొత్తగా తీసుకున్న ఈ కార్డులతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారా? కొత్త కార్డులపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్‌కు డిఫాల్ట్‌గా అనుమతి ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కస్టమర్ల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను సురక్షితంగా మార్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతదేశంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు చాలానే జరుగుతుంటాయి. అయితే ఈ మోసాలకు వీలైనంత వరకు బ్రేక్ వేసేందుకు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కార్డులపై అన్ని రకాల ట్రాన్సాక్షన్స్‌కు డిఫాల్ట్‌గా అనుమతి ఇవ్వట్లేదు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తీసుకుంటే చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేదా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఈ సేవల్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్తగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కు ఈ రూల్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)