1. సాధారణంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. తిరిగి అప్పు చెల్లించగలరా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి ఆర్థిక సంస్థలు వారి క్రెడిట్ రిపోర్ట్ లోని సమాచారాన్ని పరిశీలిస్తాయి. క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి విషయంలోనూ ఇదే జరుగుతుంది. బ్యాంకులు రుణవడ్డీ రేటును నిర్ణయించడానికి కూడా క్రెడిట్ రిపోర్ట్ సమాచారాన్ని పరిశీలిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. రుణగ్రహీతలు తమ క్రెడిట్ అర్హతను తెలుసుకోవడానికి క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని తరచూ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే తప్పుడు సమాచారాన్ని కూడా గుర్తించవచ్చు. అయితే క్రెడిట్ రిపోర్ట్ పరిశీలించేటప్పుడు.. రుణగ్రహీతలు శ్రద్ధగా సమీక్షించాల్సిన అంశాలు ఏవో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. Credit Accounts: యాక్టివ్ గా ఉన్న, క్లోజ్ చేసిన మీ క్రెడిట్ ఖాతాలు క్రెడిట్ రిపోర్ట్ లోని క్రెడిట్ అకౌంట్స్ (Credit accounts) సెక్షన్ లో లిస్ట్ అయ్యి ఉంటాయి. రుణదాతలు మీ క్రెడిట్ అర్హతను అంచనా వేసేటప్పుడు ఈ సమాచారాన్ని పరిశీలిస్తారు. అందుకే మీ లోన్, క్రెడిట్ కార్డ్ ఖాతా వివరాలు తప్పులు లేకుండా రిపోర్ట్ లో కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. లేనిపక్షంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గి.. క్రెడిట్ అర్హతపై తీవ్ర ప్రభావం పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Repayment History: ఈ సెక్షన్ లో మీ రుణం, క్రెడిట్ కార్డుల రీపేమెంట్ హిస్టరీ లిస్ట్ అయి ఉంటుంది. ఇందులో గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించిన నెలలు.. ఆలస్యమైన చెల్లింపుల వివరాలను కూడా ఉంటాయి. వీటిని కూడా రుణదాతలు పరిశీలిస్తారు. అందుకే, మీ క్రెడిట్ రిపోర్టులో రీపేమెంట్ హిస్టరీ వివరాలు కచ్చితంగా అప్డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Personal Details: ఈ సెక్షన్ లో మీ పేరు, పాన్, మొబైల్ నంబర్, కమ్యూనికేషన్ అడ్రస్ మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది. బ్యాంకులు మీ రుణ/క్రెడిట్ కార్డ్ దరఖాస్తును పరిశీలించేటప్పుడు.. మీ క్రెడిట్ రిపోర్ట్ లోని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేస్తాయి. అయితే ఈ సమాచారంలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే.. రుణం పొందే అవకాశాలు తగ్గుతాయి. అందుకే పర్సనల్ డీటెయిల్స్ కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
6. Credit Utilization Ratio: మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు రుణదాతలు మీ క్రెడిట్ లిమిట్లో మీరు ఎంత మొత్తం వినియోగించారనేది తెలుసుకుంటారు. మీ వినియోగాన్ని తెలియజేసేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(సీయూఆర్). అయితే 30 శాతం లోపు సీయూఆర్ ఉన్న వ్యక్తులకే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. మీ క్రెడిట్ అర్హత దెబ్బతినకుండా ఉండాలంటే.. క్రెడిట్ పరిమితిని పెంచమని మీకు క్రెడిట్ కార్డు జారీచేసే కంపెనీలను అభ్యర్థించాలి. లేదా మరొక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల రుణాలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురుకావు. (ప్రతీకాత్మక చిత్రం)
7. Credit Report Enquries: ఈ సెక్షన్ లో మీరు రుణం కోసం ఆశ్రయించే బ్యాంకుల వివరాలు లిస్టు అయి ఉంటాయి. ఇందులో రుణదాత పేరు, దరఖాస్తు చేసిన తేదీ, దరఖాస్తు చేసుకున్న క్రెడిట్ మొత్తం వివరాలు ఉంటాయి. అందుకే మీరు తక్కువ సమయంలోనే అనేక బ్యాంకులలో రుణాల కోసం రిక్వెస్ట్ లు పెట్టకండి. అలా చేస్తే మీ క్రెడిట్ కార్డు స్కోరు గణనీయంగా దెబ్బతింటుంది. దీనినే హార్డ్ ఎంక్వయిరీస్(hard enquiries) అని పిలుస్తారు. దీనికి బదులు ఆన్లైన్ లో సాఫ్ట్ ఎంక్వయిరీస్ చేయడం ఉత్తమం. దీనివల్ల క్రెడిట్ కార్డు స్కోరుపై ఎలాంటి ప్రభావం పడదు. (ప్రతీకాత్మక చిత్రం)