1. ఆధార్ కార్డ్... పౌరులకు ఇప్పుడు దాదాపు ప్రతీ చోట ఉపయోగపడుతున్న డాక్యుమెంట్. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి, పాన్ కార్డ్ (PAN Card) ఉపయోగించి లావాదేవీలు చేయడం వరకు, ఆధార్ కార్డుది (Aadhaar Card) ముఖ్యమైన పాత్ర. అంతేకాదు పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి అనేక ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల్ని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కాబట్టి ఆధార్ కార్డులో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం తప్పనిసరి. చాలామంది ఆధార్ కార్డ్ హోల్డర్స్ వివరాలు అప్డేట్ చేయకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హడావుడిగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తున్నారు. ఆధార్ వివరాల అప్డేట్ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ముఖ్యమైన సూచన చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీ ఆధార్ కార్డ్ జనరేట్ చేసి 10 ఏళ్లు దాటితే, 10 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేయకపోతే వెంటనే ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సబ్మిట్ చేసి రీవెరిఫై చేయాలని యూఐడీఏఐ సూచించింది. ఆన్లైన్లో వివరాలు అప్డేట్ చేస్తే రూ.25, ఆఫ్లైన్లో వివరాలు అప్డేట్ చేస్తే రూ.50 ఛార్జీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆన్లైన్లో మీ ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. Online Update Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)