Gold: బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ ఇవ్వాలా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Gold: బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ ఇవ్వాలా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Gold | మీరు బంగారు నగలు కొంటున్నారా? బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఇవ్వాలా? దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకోండి.
1. బంగారు నగలు కొంటే షాపులో తప్పనిసరిగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు డాక్యుమెంట్ ఇవ్వాలన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. దీంతో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. అసలు బంగారు నగలు కొంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవ్వాలా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ-DoR క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. రూ.2,00,000 లోపు బంగారం, వెండి, నగలు, విలువైన రత్నాలు, రాళ్లు కొంటే మీరు కేవైసీ డాక్యుమెంట్ అంటే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ-DoR తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 ప్రకారం డీలర్లు రూ.10,00,000 కన్నా ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా విలువైన లోహాలు, రాళ్లు, రత్నాలు కొంటే కేవైసీ డాక్యుమెంట్ ఇవ్వాలని 2020 డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అంటే 2020 డిసెంబర్ 28న జారీ చేసిన నోటిఫికేషన్ డీలర్లకు వర్తిస్తుంది. అది కూడా రూ.10,00,000 కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితేనే కేవైసీ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్-FATF నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ-DoR ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రూ.2,00,000 లోపు బంగారు నగలు కొన్నా కైవేసీ తప్పనిసరి అన్న ప్రచారం మొదలైంది. దీంతో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఒక వేళ రూ.2,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు కొంటే తప్పనిసరిగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 269ST ప్రకారం భారతదేశంలో ఎవరూ రూ.2,00,000 కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరపడం నిషేధం. అంటే రూ.2,00,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే నగదు ద్వారా చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)