1. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) లాంగ్ టర్మ్ మోటార్ ప్రొడక్స్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మోటార్ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్‌తో పాటు ఓన్ డ్యామేజ్ ఇన్స్యూరెన్స్ ఇందులో కవర్ కానుంది. కార్లకు 3 ఏళ్లు, టూవీలర్లకు 5 ఏళ్ల లాంగ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తీసుకురానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కస్టమర్లకు మరిన్ని ఆప్షన్స్ ఇచ్చేందుకు కార్లకు మూడేళ్ల ఇన్స్యూరెన్స్ కవర్, స్కూటర్లు, బైకులకు ఐదేళ్ల ఇన్స్యూరెన్స్ కవర్‌తో ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్డీఏఐ భావిస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ రూపొందించింది. అన్ని జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కార్లకు మూడేళ్ల, టూవీలర్లకు ఐదేళ్ల ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తూ డ్రాఫ్ట్‌ను ప్రతిపాదించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎన్నేళ్ల కవరేజీ ఉంటే అన్నేళ్ల ప్రీమియంను ఇన్స్యూరెన్స్ అమ్మే సమయంలోనే కంపెనీ వసూలు చేస్తుంది. అంటే వాహనదారులు ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించి లాంగ్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. డ్రాఫ్ట్ ప్రకారం లాంగ్ టర్మ్ డిస్కౌంట్, క్లెయిమ్‌ల అనుభవం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పాలసీ ప్రీమియంను కంపెనీలు నిర్ణయిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. యాడ్-ఆన్, ఆప్షనల్ కవర్ల ధరను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ డ్రాఫ్ట్‌పై వాహనదారులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఇతర స్టేక్‌హోల్డర్స్ తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను డిసెంబర్ 22 వరకు తెలపొచ్చు. ఇక ఓన్ డ్యామేజ్ పాలసీల్లో ఒక ఏడాది నో క్లెయిమ్ బోనస్ లాంగ్ టర్మ్ పాలసీలకు కూడా వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. లాంగ్ టర్మ్ పాలసీల విషయంలో పాలసీ వ్యవధి ముగింపులో వర్తించే నో క్లెయిమ్ బోనస్, రెన్యువల్ సమయంలో పొందొచ్చు. అయితే ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ మాత్రమే. పూర్తి నియమనిబంధనలు రావడానికి ఇంకా సమయం ఉంది. వాహనదారులు, కస్టమర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నియమనిబంధనల్ని రూపొందిస్తుంది ఐఆర్డీఏఐ. (ప్రతీకాత్మక చిత్రం)