Home » photogallery » business » IRDAI DESIGNED UNIFORM HEALTH INSURANCE PRODUCT AROGYA SANJEEVANI POLICY TO LAUNCH ON 2020 APRIL 1 KNOW BENEFITS SS

Arogya Sanjeevani: సామాన్యుల కోసం సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్... ఏప్రిల్ 1న ప్రారంభం

Arogya Sanjeevani Health Insurance Policy | తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పుడో, ఏదైనా ప్రమాదం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడో హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరమేంటో తెలుస్తుంది. అవసరం ఉండకపోవచ్చని అనేకమంది హెల్త్ పాలసీలు తీసుకోరు. కానీ అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపపడుతుంటారు. అందుకే సామాన్యుల అవసరాలు తీర్చేందుకు ఐఆర్‌డీఏఐ ప్రత్యేకంగా ఓ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రూపొందించింది. ఏప్రిల్ 1న ఈ కొత్త పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.