1. కొత్త సంవత్సరంలో టూర్లకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) తక్కువ ధరకే టూర్ ప్యాకేజీ ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు టూర్ ప్రకటించింది. కేవలం రూ.10,400 ప్యాకేజీతో 11 రోజుల టూర్‌కు తీసుకెళ్తోంది ఐఆర్సీటీసీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ టూర్లో భాగంగా మొదటి రోజు పర్యాటకులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, పలాసలో రైలు ఎక్కాలి. రెండో రోజు, మూడో రోజు మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది. నాలుగో రోజు సోమనాథ్ చేరుకుంటారు. అక్కడ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ద్వారక బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐదో రోజు ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారాకాదీశ్ ఆలయంతో పాటు ఇతర ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి ద్వారకలో బస చేయాలి. ఆరో రోజు బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత వాత్వ బయల్దేరాలి. ఏడో రోజు వాత్వ చేరుకుంటారు. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయం సందర్శన ఉంటుంది. రాత్రికి వాత్వలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. పదకొండో రోజు పర్యాటకులు పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ వైబ్రంట్ గుజరాత్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.10,400 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, టీ, కాఫీ, శాకాహార భోజనం, రోజూ 1 లీటర్ డ్రింకింగ్ వాటర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఆలయాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రెన్స్ ఫీజులు ఇందులో కవర్ కావు. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)