1. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం విజయవాడ, రాజమండ్రి నుంచి తిరుపతికి (Rajahmundry to Tirupati) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గోవిందం పేరుతో విజయవాడ, రాజమండ్రి నుంచి మరో ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ ఆలయ దర్శనం మాత్రమే కవర్ అవుతాయి. ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ తిరుపతి టూర్ ప్రతీ శుక్రవారం ప్రారంభం అవుతుంది. శేషాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట జంక్షన్లో సాయంత్రం 5.40 గంటలకు, రాజమండ్రిలో 6.20 గంటలకు, విజయవాడలో రాత్రి 10.50 గంటలకు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీకి ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3780, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4520. కంఫర్ట్ ప్యాకేజీకి ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5340, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5430, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.6170. (ప్రతీకాత్మక చిత్రం)
6. టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌కు స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్‌కు థర్డ్ ఏసీ ప్రయాణం, వసతి, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి తిరుపతికి ట్రైన్ టూర్, ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. మూడునాలుగు రోజుల పాటు టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని ప్యాకేజీల్లో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కవర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)